Breaking News

నగరంలో నూతనంగా కోచింగ్ సెంటర్ ప్రారంభం…..!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ విద్యార్థులకు విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందించాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ ( చిన్ని) అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్ నందు తమ ఆఫ్లైన్ బ్రాంచ్ అయిన విద్యా పీఠ్ ను ఆన్లైన్ ఫిజిక్స్ వాలా నూతనంగా ప్రారంభించింది. ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు మహమ్మద్ నజీర్,అమిత్ సింగ్, విద్యా పీట్ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసలతో కలసి పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ఇప్పటివర కు ఫిజిక్స్ వాలా ఆన్లైన్లో క్లాసులు బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందేనని, మొదటి సారిగా ఆఫ్లైన్ విద్యా విధానంతో నగరంలోని బెంజ్ సర్కిల్ నందు విద్యా పీట్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. దాదాపు గా ఫిజిక్స్ వాలా 250 బ్రాంచ్లతో విస్తరించి ఉన్న సంగతి తెలి సిందేనని, విజయవాడ విశాఖపట్నం కేంద్రంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ముదవహం అన్నారు. సుధీర ప్రాంత విద్యార్థులకు సైతం ఈ కోచింగ్ సెంటర్ అనువు గా ఉంటుందని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఒక వేదిక అవుతుందని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో ఫిజిక్స్ వాలా విద్యా పీఠ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య నుందిస్తూ అంచలంచలు గా అభివృద్ధి చెందాలని ఎంపీ కేశినేనీ శివనాథ్ ఆకాంక్షించారు.

శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి రాయల్ వారసుడు శ్రీ జి శ్రీకాంత్ కి చిరంజీవి అభినందనలు

మహిళా హక్కుల కోసం పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *