మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ భారీ ఈవెంట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఉగాది కానుకగా ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మార్చి 15న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూసుఫ్‌గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ (1st బెటాలియన్)లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
భారీ జనసందోహం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
- జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి KBR స్టేడియం వైపు వెళ్లే వాహనాలను కృష్ణా నగర్ జంక్షన్ వద్ద నుంచి శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి Madhapur, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను యూసఫ్‌గూడ బస్తీ వద్ద నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ – కృష్ణానగర్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
- మైత్రీవనం నుంచి Borabanda వైపు వెళ్లేవారు సవేరా ఫంక్షన్ హాల్ – కృష్ణకాంత్ పార్క్ – జీటీఎస్ టెంపుల్ – కళ్యాణ్ నగర్ – Moti Nagar మార్గం ద్వారా వెళ్లాలి.
- బోరబండ నుంచి మైత్రీవనం వెళ్లేవారు ప్రైమ్ గార్డెన్ – మిడ్‌ల్యాండ్ బేకరీ – జీటీఎస్ కాలనీ – కళ్యాణ్ నగర్ జంక్షన్ – ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా వెళ్లాలని సూచించారు.
పార్కింగ్ ఏర్పాట్లు
ఈ ఈవెంట్‌కు వచ్చే అభిమానుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు.
- జానకమ్మ తోట పార్కింగ్ – ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు
- యూసఫ్‌గూడ మెట్రో పార్కింగ్ – ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు
- సవేరా ఫంక్షన్ హాల్ – కేవలం ఫోర్ వీలర్స్
- మహమూద్ ఫంక్షన్ హాల్ – కేవలం ఫోర్ వీలర్స్
ఈ నేపథ్యంలో యూసఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
