Breaking News

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీకి పాజిటివ్

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ (SP Rachakonda Eagle Team) మీడియాకు తెలిపారు. శనివారం నిర్వహించిన మొదటి పరీక్షలో పుట్టా మహేష్‌కు నెగెటివ్ వచ్చినప్పటికీ, ఆదివారం నిర్వహించిన పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. శరీర మెటబాలిజం కారణంగా రిపోర్టుల్లో మార్పులు రావచ్చని అధికారులు తెలిపారు.ఈ కేసులో మొత్తం 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. Kaushik Ravi అనే వ్యక్తి Shimla నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి పార్టీలు జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *