బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
భక్తి

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. రూ.120 కోట్లతో కొత్త అన్నప్రసాద కేంద్రం

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. రూ.120 కోట్లతో కొత్త అన్నప్రసాద కేంద్రం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.120 కోట్ల విరాళం అందించనుంది.టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ వంటశాల (మోడ్రన్ కిచెన్)తో పాటు పెద్ద అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించనున్నారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు మరింత వేగంగా, మెరుగైన సౌకర్యాలతో అన్నదానం అందించవచ్చు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీని ఉపయోగించి వంట ప్రక్రియను ఆధునీకరించనున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నదాన సేవలను టెక్నాలజీతో మెరుగుపరచాలని సూచించగా, ఆ దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం లో ఒకేసారి వేలాది మంది భక్తులకు అన్నదానం అందించే సౌకర్యం ఉంది. కొత్తగా నిర్మించనున్న కేంద్రంతో పాటు రెండు ప్రత్యేక డైనింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.గత ఏడాది ముఖేష్ అంబానీ తిరుమల సందర్శన సమయంలో అన్నదాన సేవల కోసం విరాళం ప్రకటించారు. ఆ విరాళంతోనే ఈ కొత్త అన్నప్రసాద కేంద్రం నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

శ్రీవారికి భారీ కానుక.. విద్యుత్ బస్సు, ట్యాబ్‌ల విరాళం