బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది.భద్రతా దళాలు మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి బుఖార్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. మార్చి 14–15 మధ్య రాత్రి నిఘా సమాచారంతో ఆర్మీ అప్రమత్తమైంది. సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరగగా ఒక ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు.

ఈ ఘటన అనంతరం ప్రాంతమంతా భద్రతా దళాలు కంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరెవరైనా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌తో సరిహద్దు గుండా చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా రాజౌరి జిల్లా లోని నియంత్రణ రేఖ సమీపంలో కూడా మరో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. నౌషేరా సెక్టార్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా దళాలు వారిని ఆపేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, మరో వ్యక్తి కోసం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ