బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆటో డ్రైవర్లకు శుభవార్త.. ఎలక్ట్రిక్ కిట్లపై 100% సబ్సిడీ.. రూ.200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు శుభవార్త.. ఎలక్ట్రిక్ కిట్లపై 100% సబ్సిడీ.. రూ.200 కోట్లు కేటాయింపు

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్లపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కొత్త రెట్రోఫిట్‌మెంట్ పాలసీను తీసుకురానుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.ఈ పాలసీ కింద ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కిట్లను అందించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నడిచే ఆటోలను దశలవారీగా ఈవీగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.

అధికారుల అంచనాల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సుమారు 1.26 లక్షల ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం ఒక ఆటోను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఖర్చును డ్రైవర్లపై భారం పడకుండా ప్రభుత్వం 100 శాతం సబ్సిడీగా అందించనుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు ఆటో డ్రైవర్లకు ఇంధన ఖర్చులు కూడా భారీగా తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి