Breaking News

‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడలేదా..? మార్చి 31లోగా ఈ పనులు చేస్తే అకౌంట్‌లోకి వస్తాయి

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.6,000 జమ అయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4,000 చొప్పున జమ చేశారు.ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేశారు. అయితే కొంతమంది రైతుల అకౌంట్లలో ఇంకా డబ్బులు జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డబ్బులు పడకపోవడానికి కారణాలు

రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా:

  • బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ లేకపోవడం
  • బ్యాంక్ ఖాతా NPCI మ్యాపింగ్ కాకపోవడం
  • ఆధార్ e-KYC పెండింగ్లో ఉండటం
  • భూమి రికార్డుల్లో తప్పులు ఉండటం

ఏమి చేయాలి..?

డబ్బులు రాని రైతులు ముందుగా గ్రామ/వార్డు సచివాలయం లేదా రైతు సేవా కేంద్రంకి వెళ్లి కారణం తెలుసుకోవాలి. అధికారులు సమస్యను గుర్తించి పరిష్కార మార్గం చెబుతారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీకి పాజిటివ్

మార్చి 31లోగా ఈ పనులు చేయాలి

  • భూమి వివరాల్లో తప్పులు ఉంటే మీ భూమి పోర్టల్లో చెక్ చేసి ఎమ్మార్వో కార్యాలయంలో సరిచేయాలి
  • ఆధార్ – బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోవాలి
  • బ్యాంక్‌లో NPCI మ్యాపింగ్ యాక్టివ్ చేయించుకోవాలి
  • PM Kisan Samman Nidhi వెబ్‌సైట్‌లో e-KYC పూర్తి చేయాలి

ఈ వివరాలు సరిచేస్తే మార్చి 31లోగా పెండింగ్‌లో ఉన్న డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది.

హెల్ప్‌లైన్ నెంబర్లు

సమస్యలు ఉంటే రైతులు ఈ నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు:

  • 155261 – పీఎం కిసాన్ హెల్ప్‌లైన్
  • 1902 – ఫిర్యాదు నమోదు కోసం

ఈ ప్రక్రియలు పూర్తి చేస్తే ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగ విజయవాడ-బెంగళూరు మార్గంలో ‘స్మార్ట్ బస్ ఏక్యూఐ’ సేవలు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *