4 లక్షల రాయల్ ఉద్యోగుల మద్దతు కూడా వుండదు .
కర్నాటక బలిజ కాపు ఉద్యోగ సంఘం మరియు దక్షిణ భారత శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ సంఘం ఐక్య వేదిక తోలు వార్షికోత్సవాలు అంగర రంగ వైభవంగా జరిగాయి.
15/03/2026: బెంగుళూరు,(నేటి తెలుగు పత్రిక): కాలజ్ఞాని శ్రీ శ్రీ శ్రీ కైవార నారాయప్ప (కైవార తాతయ్య) గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక బలిజ సంఘం & దక్షిణ భారత దేశం శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ సమాఖ్య దక్షిణ భారత సమావేశం ఈ రోజు బెంగుళూరు లోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బలిజ ఉద్యోగుల సంఘం మొదటి వార్షిక సమావేశం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గోపాల కృష్ణ గారి అధ్యక్షతన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో జరిగింది, ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం లోని బలిజ ఉద్యోగులు తో పాటు ఆంధ్రా , తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల ప్రముఖులు హాజరైనారు.
దక్షిణ భారత దేశచరిత్రలో తన పాలనను స్వర్ణ యుగంగా లిఖించిన శ్రీకృష్ణ దేవరాయల వారు జన్మించి రాజ్య స్థాపన చేసి ప్రజలకు చక్కని పాలనను అందించిన ఈ ప్రదేశం లో మన సంఘం యొక్క ప్రథమ వార్షికోత్సవ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి కన్వీనర్ ఎస్ రామక్రిష్ణ గారు మాట్లాడుతూ , నేను శ్రీకృష్ణదేవరాయల వారసుడ్ని మీరు కూడా వారసులేనా అని సభ్యులను ప్రశ్నిస్తూ తన ఉపన్యాసంతో యావత్ బలిజ కాపు ఉద్యోగులను ఉత్తేజపరుస్తూ భవిష్యత్తులో మనము దక్షిణార్థ రాష్ట్రాలలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే ప్రయత్నం చేయాలని గతంలో నేను మన రాయల్ వారసుడు పార్టీని అధికారంలోకి తేవడానికి చేసిన ప్రయత్నాలు వల్ల ఆరు మాసాలు ఉద్యోగానికి సస్పెండ్ అయ్యానని అయినా నా జాతి కోసం నా రాయల్ రాజ్యం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ని కాపు ఉపకులాలన్నింటినీ ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వారందరినీ ఏకతాటిపై తెచ్చి మనం మన వారిని రాజ్యాధికారంలోకి తేవాలని ఉత్తేజదాయకమైన ఉపన్యాసం ఇచ్చారు, తర్వాత అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ జి ఎస్ గణపతి రావు మాట్లాడుతూ విష్ణుమూర్తికి తన రాజ్యాన్ని దేహాన్ని తృణప్రాయంగా భావించి దానం చేసినటువంటి బలి చక్రవర్తి వంశానికి చెందిన బలిచకాపు వర్గీయులు కర్ణాటకలో ఏకం కావాలని మనవారిని రాజ్యాధికారంలోకి తేవాలని భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కింపబడిన మహనీయులు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వారమని ఈ సమావేశం ద్వారా తెలిసి నాకు చాలా ఆనందంగా ఉన్నదని కర్ణాటక బలిజ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ బాబు శ్రీనివాసరావుల కృషితో ఈ సంఘం ఏర్పడి ఇక్కడ బలిజ కాపు కులస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వారికి ఆంధ్రప్రదేశ్ కాపు కులం సంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేవరకు రాయల్ వారసుల నేతలతో & ఉద్యోగుల నాయకత్వంలో కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన టీచర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పసుపులేటి రమేష్ గారు అడవి శాఖ రాష్ట్ర అధ్యక్షులు కె రమేష్ గారు & కర్ణాటక ఎం.కె యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్రీ గోవిందప్ప గారు, అఖిలభారత లేబర్ కమిషనర్ శ్రీ సందీప్ గారు, బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఏ జి శ్రీనివాస్ గారు, ఆల్ ఇండియా బలిజ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జగన్నాథ్ గారు, బెంగళూరు లోకల్ ఎంఆర్ఓ శ్రీమతి మమత గారు ముఖ్య అతిథులుగా పాల్గొని బలిజ కాపు కులస్తులను ఉత్తేజపరుస్తూ మన సంఘాల అభివృద్ధికి ఏ రకమైన సహకారం కావాలన్నా మోము ముందు ఉంటామని తెలియజేశారు
కార్యచరణ & డిమాండ్స్
1) కన్నడ బలిజలను BC రిజర్వేషన్ వర్తింప చేయాలి
2) రాజకీయ పార్టీలు బలిజ 25 వేల మంది వున్న నియోజకవర్గం లో & రాయల్ వారసులకు కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో టికెట్ ఇవ్వాలి..కనీసం 4 పార్లమెంటు స్థానాలు కూడా ఇవ్వాలి..
3) ఉద్యోగుల కు పోక్కల్ స్దానాలో రాష్ట్ర స్దాయు లో పోస్టింగ్ ఇవ్వాలి
4) రాయల్ జయంతి ని అధికారికంగా ప్రకటించాలి
5) బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు రుపాయలు బలిజలకు ఆర్ధిక సహాయం చేయాలి
6) హంపి ని అంతర్జాతీయ విమానాశ్రయం, యూనివర్సిటీ, టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి.
7) జిల్లా, మండల స్థాయి లో బలిజ భవనాలు ప్రభుత్వం ఏర్పాటు.
యస్ రామకృష్ణ
కన్వీనర్
శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి
ఆంధ్రప్రదేశ్

