Breaking News

కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

విజయవాడ. మార్చి 15 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని), తూర్పు శాసనస భ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ట్రస్ట్ ను ఏర్పాటు చేసి 10 సంవ త్సరాలు పూర్తి అయిన సందర్భంగా పడమట లోని హై స్కూల్ రోడ్డు రైతు బజార్ వద్ద ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో 11వ డివిజన్ శానిటరీ కార్మికు లకు నూతన వస్త్రాలు, చెత్త సేకరణ తోపుడు బండి, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని ) మాట్లాడుతూ… కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం అభినందనీయమన్నారు. ట్రస్ట్ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించుకోవడం సంతోషకరమన్నారు.

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన….!

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. సమాజ సేవ తత్పరత ఉన్న కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. రూ . 50,000 వ్యయంతో డివిజన్ శానిటరీ కార్మికులకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫారం రిక్షా, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. మేనేజిం గ్ ట్రస్ట్రీ కోనేరు వెంకట రమేష్, సభ్యులు నాయి ని ఝాన్సీ రాణి, కొల్లిపర రాజ్యలక్ష్మి, కోనేరు రాజేష్, కోనేరు రూపేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేట ర్లు చెన్నుపాటి ఉషారా ణి, పొట్లూరిసాయిబాబు, ముమ్మినేని వెంకటప్రసా ద్, 11వ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాదెళ్ల రాజేష్, సీనియర్ నాయ కులు జాస్తి సురేష్, పాలడుగు ప్రసాద్, దేవరపల్లి ఆంజనేయు లు, పామర్తి కిషోర్, పట్నాల సదాశివ రావు, కొనసాని నాగమణి, రొయ్యూరు శ్రీనివాస్, కలగర్ర మాధవి, మునగా ల చిన్నపిచ్చయ్య యల మంచిలి సత్య వర ప్రసా ద్, బంగారు మురళీ కృష్ణ లతో పాటుగా తోపుడు బండ్లు అందుకున్న చిరు వ్యాపారులు ఆకుల దుర్గ, గుడివాడ శాంత మ్మ తదితరులు పాల్గొన్నారు.

అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *