Breaking News

అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం..!

విజయవాడ. మార్చి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అక్షరాస్యతను ప్రోత్స హించేందుకు నిర్వహిస్తు న్న అక్షర ఆంధ్ర (FLNAT) ఫైనల్ పరీక్ష ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో విజ యవంతంగా నిర్వహించ బడింది. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 97,047 మంది అభ్యర్థులను అక్షర ఆంధ్ర యాప్‌ లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయగా, అందు లో 95,598 మంది పరీక్ష కు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ లోని వాంబే కాలనీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీ లించారు. పరీక్షలు సజా వుగా జరుగుతున్న తీరు ను అధికారులతో కలిసి పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడి వారికి ప్రోత్సా హం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను ముఖ్యం గా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్య మని తెలిపారు. ఈ కార్య క్రమంద్వారా చదవడం, రాయడం, ప్రాథమిక గణి తం మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీలపై కూడా అవగాహన కల్పిం చడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి కార్య క్రమాల ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొంద డంతో పాటు వారి ఆత్మ విశ్వాసం పెరుగుతుందని దాని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య నోడల్ ఆఫీసర్ జి. ప్రసా దరావు, యూసీడీ పీవో ఎం.విజయలక్ష్మి తదిత రులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *