Breaking News

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన….!

విజయవాడ. మార్చి15 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుజనా ఫౌండే షన్ మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆదివారం 43 వ డివిజన్ ఊర్మిళా నగర్ పార్క్ సెంటర్ సచివాల యం వద్ద క్యాంపు నిర్వ హించారు. ఉదయం నుం చి సాయంత్రం వరకు జరి గిన మెడికల్ క్యాంపు లో పలు ఆరోగ్య సమస్యల కు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహా యం పొందారు. ఈ క్యాం పులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్స ల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , అల్ట్రా స్కానింగ్ తదితర పరీక్ష లు ఉచితంగా నిర్వహిం చారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారి సిబ్బంది, టెక్నిషియన్స్, వైద్యులు క్యాంపుకు సహ కరించారు. అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యం లో కంటి పరీక్షలు నిర్వ హించారు. అదే విధంగా ప్రభుత్వ దంత వైద్యశాల వారిచే దంత సమస్యలు ఉన్న వారికి దంత పరీక్ష లు నిర్వహించి వాటికి సంబంధించిన వైద్య సహా యం కూడా అందచేశారు. జనసేన డివిజన్ అధ్యక్షు లు కోటి, వీరమహిళ శ్రీదేవి, కూటమి నాయకు లు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట రమణ, హరీష్ లతో పాటు సుజనా మిత్ర కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *