Breaking News

ఎంపీ వద్దిరాజు అనారోగ్యంతో బాధపడుతున్న పాషాకు పరామర్శ

మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహ్మద్ హుస్సేన్ తమ్ముడు అన్వర్ పాషా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ విషయం తెలియడంతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాపు కృష్ణలతో కలిసి ఆదివారం సాయంత్రం రామవరంలోని వారి నివాసానికి వెళ్లి అన్వర్ పాషాను పరామర్శించారు.పాషా ఆరోగ్య పరిస్థితిని ఎంపీ రవిచంద్ర అడిగి తెలుసుకుని మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సాయమందిస్తానని హామీనిచ్చారు.పాషా త్వరితగతిన కోలుకుని కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి రంజాన్ని పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *