బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ కేసు కలకలం.. పుట్టా మహేష్‌పై చంద్రబాబు సీరియస్

డ్రగ్స్ కేసు కలకలం.. పుట్టా మహేష్‌పై చంద్రబాబు సీరియస్

మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఎన్.చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన ఆయన, క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదని మరోసారి సందేశం ఇచ్చారు.మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పుట్టా మహేష్ కుమార్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. యాంటీ నార్కోటిక్స్ అధికారులు నిర్వహించిన టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం రావడంతో టీడీపీ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా పుట్టా మహేష్‌ను తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సరైన సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను పుట్టా మహేష్ ఖండిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా, వై. ఎస్. షర్మిల వెంటనే పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.పుట్టా మహేష్ ఇచ్చే వివరణ తర్వాత టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.