Breaking News

రైతు భరోసా పథకంపై క్లారిటీ.. వీరికి మాత్రం డబ్బులు రావు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను మూడు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించారు.మొదటి విడతగా రూ.3,590 కోట్లను విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. తొలి విడతలో సుమారు 73 లక్షల మంది రైతులకు ఈ సాయం అందనుంది. రెండో విడతను 20 రోజుల తర్వాత విడుదల చేయనుండగా, మూడో విడతను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ.9 వేల కోట్లను రైతులకు అందించనున్నారు.

అయితే కొన్ని వర్గాల వారికి రైతు భరోసా వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన వారు కాకపోవడం, ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు కాకపోవడం వంటి కారణాలతో అనర్హులుగా ప్రకటించవచ్చు. అలాగే వ్యవసాయానికి అనుకూలం కాని బీడు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ భూములకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందేవారు, ఆదాయపన్ను చెల్లించే వారు, ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకానికి అనర్హులు. అలాగే ఆలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరుపై ఉన్న భూములు ఉన్నవారికి కూడా రైతు భరోసా వర్తించదు.రైతు భరోసా పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. రైతు తెలంగాణకు చెందినవాడై ఉండాలి. కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు మీద భూమి ధరణి పోర్టల్ లో నమోదు అయి ఉండాలి. అలాగే వ్యవసాయానికి అనుకూలమైన భూమి అయి ఉండాలి. ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద పట్టాదారులు అయిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచింది. గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.10 వేల సాయం అందించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఈ సాయాన్ని ఎకరానికి ఏడాదికి రూ.12 వేలుగా పెంచింది. అలాగే కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *