బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బీర్ల

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బీర్ల
  • మల్లన్న సాగర్ నుండి ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.

యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గ రైతాంగ ప్రయోజనాలే ధ్యేయంగా *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదివారం సాయంత్రం మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారు.నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను నింపే ప్రక్రియలో భాగంగా బీర్ల అయిలయ్య ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ . స్వయంగా మల్లన్న సాగర్‌ను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లను ఎత్తారు.ఆలేరు నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్న ఇతర నియోజకవర్గాల్లోని ఎండిపోయిన చెరువులను నింపడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల జరిగింది.
నీటి విడుదల సందర్భంగా జల దేవతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.​ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ:​”ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఎండకాలంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మల్లన్న సాగర్ నుండి చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టాం అని అన్నారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, మన నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం.ఈ నీటి విడుదలతో నియోజకవర్గంలోని భూగర్భ జల మట్టం పెరగడంతో పాటు, వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది.రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు మరియు నియోజకవర్గ రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి