బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఖతార్ నుంచి భారత్‌కు ఎల్పీజీ గ్యాస్‌.. ముంద్రా పోర్టుకు చేరుకున్న శివాలిక్ నౌక

ఖతార్ నుంచి భారత్‌కు ఎల్పీజీ గ్యాస్‌.. ముంద్రా పోర్టుకు చేరుకున్న శివాలిక్ నౌక

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో గ్యాస్ సరఫరాకు ఊరట కలిగించేలా ఖతార్ నుంచి ఎల్పీజీ గ్యాస్ తీసుకొచ్చిన నౌక గుజరాత్ తీరానికి చేరుకుంది. శివాలిక్ LPG ట్యాంకర్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ కు చేరుకోవడంతో గ్యాస్ సరఫరా సమస్యలు కొంతవరకు తీరనున్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ ఎల్పీజీ ట్యాంకర్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఈ నౌక ఖతార్‌లోని రాస్ లఫాన్ పోర్ట్ నుంచి బయలుదేరి హార్ముజ్ జలసంధి దాటి భారత్‌కు చేరుకుంది.ఇక రాస్ లఫాన్ నుంచి బయలుదేరిన మరో నౌక నందా దేవి LPG ట్యాంకర్ ప్రస్తుతం గుజరాత్ తీరానికి సమీపంలో ఉంది. ఈ నౌక రేపు ఉదయం 6:30 గంటలకు కాండ్లా ఓడరేవు కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ రెండు నౌకలు కలిపి భారత్‌కు మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకొస్తున్నాయి. దీంతో దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ