బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు రికార్డు స్పందన.. 2.38 లక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు రికార్డు స్పందన.. 2.38 లక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్

అమరావతి,మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు పదో తరగతి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తొలిసారిగా ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పొందే సదుపాయాన్ని కల్పించగా, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ సేవను వినియోగించారు.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ (9552300009) ద్వారా విద్యార్థులు సులభంగా హాల్ టికెట్లు పొందారు. ఈ సేవకు మొత్తం 3,16,990 హిట్లు నమోదు కాగా, 2,38,728 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇక విద్యాశాఖ నిర్వహిస్తున్న లీప్ యాప్ ద్వారా 65,477 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందగా, అత్యధికంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా 7,53,834 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో డిజిటల్ అవగాహన గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి ఫిజికల్ హాల్ టికెట్లు తీసుకునేవారు. అయితే ఈసారి డిజిటల్ సేవలను వినియోగిస్తూ లక్షల సంఖ్యలో విద్యార్థులు ఆన్‌లైన్, మనమిత్ర, లీప్ యాప్ ద్వారా హాల్ టికెట్లు పొందడం విశేషంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్