Breaking News

చంద్రవెల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం

గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడి,

బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

కాసిపేట 1 ఇంక్లైన్ గనిని సందర్శించిన మందమర్రి జిఎం

బెల్లంపల్లి, మార్చి 17 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో కొంతకాలంగా పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో ఇప్పటికే పలువురిని దాడి చేసి గాయపరిచాయి. పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ గ్రామస్తులపై దాడులకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా మూడు రోజుల కిందట పిచ్చి కుక్కలు గ్రామంలో పలువురిపై దాడి చేసి విచక్షణారహితంగా కరిచాయి. పిచ్చి కుక్కల దాడిలో గ్రామానికి చెందిన కొమ్ము ఎల్లయ్య (65) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనితోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది జాడి శ్రీరాజ్ (25), మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడి మూడు రోజులుగా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో పిచ్చికుక్కల బెడద నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

స్పోర్ట్స్ మెటీరియల్ కొరకు అప్లికేషన్ అందజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *