బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

కాబూల్ దాడులపై భారత్ ఫైర్… “పిరికిపంద చర్య” అంటూ ఖండన

కాబూల్ దాడులపై భారత్ ఫైర్… “పిరికిపంద చర్య” అంటూ ఖండన

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ కాబూల్‌లో జరిపిన వైమానిక దాడులపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. కాబూల్ లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం.ఈ ఘటనలో సుమారు 400 మంది పౌరులు మృతి చెందగా, 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒమిడ్ వ్యసన చికిత్స ఆసుపత్రి పై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడం అమానుషమని, ఇది “పిరికిపంద చర్య” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఏ విధంగానూ సమర్థించలేనిదని స్పష్టం చేసింది.

అదేవిధంగా ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారంపై నేరుగా దాడి చేసినట్లేనని భారత్ పేర్కొంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఇది ముప్పు అని హెచ్చరించింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యగా ఈ ఘటనను అభివర్ణించింది.ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశామని, పౌర స్థావరాలు లేదా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వివరణ ఇచ్చింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ