బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

“దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ కార్యక్రమాన్ని గుంటూరు బస్టాండ్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహిళల కోసం అమల్లో ఉన్న “స్త్రీ శక్తి” పథకం తరహాలోనే, ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఇదే సౌకర్యాన్ని విస్తరించారు.పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో దివ్యాంగులు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నాన్‌స్టాప్, అల్ట్రా డీలక్స్, ఇంటర్‌స్టేట్, సప్తగిరి వంటి బస్సుల్లో 50% రాయితీ కొనసాగుతుంది.ఈ పథకం కింద దివ్యాంగులకు జీరో టికెట్ జారీ చేస్తారు. బస్‌పాస్ పొందడానికి సదరం సర్టిఫికేట్, ఆధార్ అవసరం. అలాగే APSRTC మొబైల్ యాప్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందవచ్చు.40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్