బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఇండియా పోస్టులో భారీ సంస్కరణలు… ఫాస్ట్ డెలివరీ స్టార్ట్

ఇండియా పోస్టులో భారీ సంస్కరణలు… ఫాస్ట్ డెలివరీ స్టార్ట్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత తపాలా శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇండియా పోస్ట్ సేవలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా పార్సిల్ సేవలను వేగవంతం చేయనున్నారు.కొత్తగా ప్రవేశపెట్టనున్న వ్యవస్థతో 24 గంటల్లోనే ఫాస్ట్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 97-98% డెలివరీలు 24 నుంచి 48 గంటల్లో పూర్తి అవుతున్నాయని తెలిపారు. ఈ మార్పులతో సుమారు 30 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.IT 2.0 కింద రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టి సాంకేతిక వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా SMS ట్రాకింగ్, OTP ఆధారిత డెలివరీ, జియో ట్యాగింగ్ వంటి ఆధునిక సౌకర్యాలను అమలు చేస్తున్నారు. అలాగే “బుక్ నౌ – పే లేటర్” సేవలను కూడా ప్రారంభించి వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించనున్నారు. తక్కువ ధరలతో సేవలు అందిస్తూ ప్రైవేట్ కొరియర్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ