Breaking News

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫిన్స్ కళాశాల ప్రతినిధి బృందం

అమరావతి, 17 మార్చి, నేటి తెలుగు పత్రిక: న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన ఎంవి పటేల్ (Patel) (అతి విశిష్ట సేవా మెడల్) నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి జి.సాయి ప్రసాద్ తో భేటీ అయింది.నేషనల్ డిఫెన్సు కళాశాల ప్రతినిధి బృందం ప్రతి యేటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి,ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరిగుతుంది.దానిలో భాగంగా ఈబృందం ఎపిలోని విశాఖపట్నం స్మార్ట్ సిటి అభివృద్ది,అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది.ఈపర్యటనలో భాగంగా ఎన్డిసి బృందం సిఎస్ తో భేటీ అయి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్ళను ప్రభుత్వం అధికమిస్తూ నిర్మాణ పనులను ఏవిధంగా ముందుకు తీసుకువెళుతున్నదీ సిఎస్ ను అడిగి తెల్సుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ఒక ఉత్తమమైన ఆధునిక రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటూ శర వేగంగా ప్రజా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతోందని ఎన్డిసి బృందానికి వివరించారు. రాష్ట్ర విభజనతో ఎదురవుతన్న అనేక ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధికమిస్తూ రాష్ట్రానికి ఒక బృహత్తరమైన రాజధాని ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్దఎత్తున నిధులు సమీకరించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నూతన రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతోందని స్పష్టం చేశారు.రహదార్లు,ఇతర మౌలిక సదుపాయాలన్నిటినీ శరవేగంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఎస్ వివరించారు.
కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లో తగిన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్నం,రాజమండ్రి,విజయవాడ,తిరుపతి,కర్నూల్,కడపల్లో విమానాశ్రయాలు ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.ఎపి జనాభా కంటే సుమారు రెట్టింపు స్థాయి జనాభా కలిగిన మహారాష్ట్రతో సమానంగా ఎపిలో విమానాశ్రాయలు ఉన్నాయని పేర్కొన్నారు.అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఓడరేవులకు అదనంగా మరికొన్ని ఓడరేవులను అభివృద్ధి చేయడం జరుగుతోందని వివరించారు.అంతేగాక పియం గతి శక్తి పధకంలో భాగంగా వివిధ జాతీయ రహదార్ల విస్తరణ, కొత్త రహదార్ల ఏర్పాటు,పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వంటి మలిక సదుపాయల విసర్తణలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు సాగుతోందని సిఎస్ సాయి ప్రసాద్ వివరించారు.
అంతకు ముందుకు ఎన్డసి ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఎంవి పటేల్ (Patel) (అతి విశిష్ట సేవా మెడల్) మాట్లాడుతూ మత ప్రతినిధి బృందం వారి కోర్సు అధ్యయనంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అనేక అంశాలను అధ్యయనం చేయడం జరిగుతోందని దానిలో భాగంగానే ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు.ఎన్డిసి ప్రతి యేటా 47 వారాల జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక అధ్యయన కోర్సును నిర్వహిస్తుందని ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో ప్రారంభమై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని వివరించారు.ఈ కోర్సులో భాగంగానే వివిధ రాష్ట్రాలను మరియు విదేశాలను సందర్శించడానికి విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇక్కడ కోర్సు సభ్యులు రాష్ట్ర అధిపతులను మరియు ముఖ్యమైన నిర్ణయాధికారులను కలుసుకుని ఆ రాష్ట్రం,దేశం యొక్క రాజకీయ, సామాజిక మరియు వ్యూహాత్మక పరిస్థితులను అర్థం చేసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత,శాస్త్ర సాంకేతిక రంగాలపై అధ్యయనం,ప్రపంచ సమస్యలు,అంతర్జాతీయ భద్రతా వాతావరణం,భారతదేశ వ్యూహాత్మక పొరుగు ప్రాంతం,జాతీయ భద్రత కోసం వ్యూహాలు మరియు నిర్మాణాలు వంటి అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందని పాటిల్ పేర్కొన్నారు.
ఈసమావేశంలో బ్రిగేడియర్లు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్,కిష్ణకాంత్ శర్మ,రోహిత్ చలపతి,బినేష్ కుమార్ పాండా,రవీంద్ర సింగ్ చేమ, బ్రిగేడియర్ జనరల్ సెబ్సడే దూబా యున్టిసో (Sebside Duba Untiso) కమాండర్ జతిన్ సింగ్,ఎయిర్ కమాండర్ అలెగ్జాండర్ మాధ్యూ,కల్నల్ లు అజయ్ గురుంగ్,కీనెత్ ఆర్ హెర్రింగ్ డైన్ (Keeneth R Herringdine)తో పాటు ప్రియం వదా శర్మ,డిఐడి అరుణ్ సింగ్,రాజశేఖర్ ఎన్,లెప్నెంట్ కల్నల్ జమ్ షిద్ ఖలిలోవ్ (Jamshid Khalilov) తదితర ప్రతినధి బృందం ఉన్నారు.

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *