బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం హామీ

అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. విజయవాడ లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన, అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి హామీ ఇచ్చారు.ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

ముస్లింల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సీఎం చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశామని తెలిపారు.ఇక మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్‌ను పెంచినట్లు పేర్కొంటూ, ఈసారి రూ.6,090 కోట్లు కేటాయించామని వెల్లడించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పింఛన్లు, గ్యాస్ సబ్సిడీలు వంటి పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోందని తెలిపారు.అన్ని మతాలను గౌరవిస్తూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్