బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి అన్నివిధాల మద్దతుగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు. అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో నిర్మించిన 58 అడుగుల విగ్రహాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ట్రస్ట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.ట్రస్ట్ ఛైర్మన్ డూండి రాకేష్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించిన మంత్రి… విగ్రహ నిర్మాణం “జెట్ స్పీడ్”లో పూర్తి చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. అమరజీవి త్యాగాన్ని భావితరాలకు చేరవేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు.లోకేష్ మాట్లాడుతూ… 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అమరావతిలో స్మృతివనం, మ్యూజియం, ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ వంటి ప్రాజెక్టులను 12 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.ఈ ఆత్మీయ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ వ్యక్తిగతంగా పలకరించి, వారి తో కలిసి ఫోటోలు దిగారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్