బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“ఫ్యూచర్ సిటీకి నిజంగా ఫ్యూచర్ ఉందా?” – కేటీఆర్ ప్రశ్న

“ఫ్యూచర్ సిటీకి నిజంగా ఫ్యూచర్ ఉందా?” – కేటీఆర్ ప్రశ్న

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత కె. టి. రామారావు (కేటీఆర్) తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు నిజంగా భవిష్యత్తు ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.గ్లోబల్ సమ్మిట్లలో ప్రకటించిన పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.టీఎస్-ఐపాస్ వెబ్‌సైట్ గత పదేళ్లలో అత్యంత పేలవంగా పనిచేస్తోందని విమర్శించిన ఆయన… గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన సుమారు 14,000 ఎకరాల భూమిని ఇప్పుడు “ఫ్యూచర్ సిటీ”, “ఫోర్త్ సిటీ” పేర్లతో మళ్లిస్తున్నారని ఆరోపించారు.

ఫార్మా సిటీ కోసం షరతులతో తీసుకున్న భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించడం సరైనది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టులో ఫార్మా సిటీ రద్దు కాలేదని చెబుతూ, బయట మాత్రం ఫ్యూచర్ సిటీగా ప్రచారం చేయడం విరుద్ధమని విమర్శించారు.కాలుష్య కారక పరిశ్రమల మధ్యలో నివాస సముదాయాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించిన ఆయన… ప్రస్తుతం కంపెనీలు రాష్ట్రం విడిచిపోతున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా కలుగుతుందో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి