బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): దేశంలో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిలిండర్లపై ఆధారపడే ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వినియోగాన్ని మితంగా ఉపయోగించుకోవాలని సూచిస్తూ, పైప్‌లైన్ ద్వారా అందే పైప్డ్ సహజ వాయువు (PNG) వినియోగాన్ని పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుతం గృహ వినియోగదారులకు PNG, అలాగే సీఎన్‌జీ సరఫరా సక్రమంగా కొనసాగుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య రంగం PNG వైపు మారితే గృహ అవసరాలకు LPG సరఫరా మరింత సులభం అవుతుందని అధికారులు తెలిపారు.ప్రస్తుతం గ్లోబల్ సరఫరా ఒత్తిళ్లు, పెరుగుతున్న డిమాండ్ కారణంగా వాణిజ్య ఎల్పీజీ కొరత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో PNG నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించిన ముఖ్య చర్యలు:

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ
  • పెండింగ్ పైప్‌లైన్ అనుమతులకు త్వరిత ఆమోదం
  • కొత్త ప్రాజెక్టులకు 24 గంటల్లో అనుమతులు
  • రోడ్డు పునరుద్ధరణ ఛార్జీల మినహాయింపు
  • పైప్‌లైన్ పనులకు సమయ పరిమితుల సడలింపు
  • నోడల్ అధికారుల నియామకం

PNG ఎందుకు మంచిదంటే… ఇది పైప్‌లైన్ ద్వారా నేరుగా సరఫరా అవ్వడంతో నిల్వ సమస్యలు ఉండవు, సరఫరా స్థిరంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇది LPGకు మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.మొత్తంగా గృహ వినియోగదారులకు LPG సరఫరాను కొనసాగిస్తూ, వాణిజ్య రంగంలో PNG వినియోగాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌ను సమతుల్యం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.