బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

మణిశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవి సినిమా ఆగిపోయిన అసలు కథ

మణిశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవి సినిమా ఆగిపోయిన అసలు కథ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మణి శర్మ తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఆసక్తికర సంఘటనలను తాజాగా పంచుకున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, చిరంజీవిలతో పనిచేసిన అనుభవాలను వెల్లడించారు.తొలుత ‘రాత్రి’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించిన మణిశర్మ, తర్వాత కొంత విరామం తీసుకున్నారు. అనంతరం దెయ్యం సినిమాతో మళ్లీ రామ్ గోపాల్ వర్మతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది.ఆ సమయంలో “నువ్వు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేస్తావ్ కానీ పాటలు చేయలేవు” అని వర్మ చెప్పడంతో, దాన్ని ఒక సవాలుగా తీసుకున్న మణిశర్మ వెంటనే ఒక ట్యూన్ కంపోజ్ చేసి వినిపించారు. అది విన్న వెంటనే వర్మ ఆయన ప్రతిభను గుర్తించి, చిరంజీవి సినిమాలో సంగీతం చేసే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.అయితే ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని మణిశర్మ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని పాటలు కూడా రికార్డ్ చేసినప్పటికీ, సినిమా పూర్తి కాలేదని చెప్పారు.ఈ ఘటన తన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచిందని, ఆ ఛాలెంజ్ వల్లే తనలోని పూర్తి స్థాయి సంగీత దర్శకుడు బయటకు వచ్చాడని మణిశర్మ పేర్కొన్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?