బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): మొక్కజొన్న రైతుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని నిరసన తెలిపిన నేతలు, రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని, అలాగే కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.

అయితే శాసనసభ ప్రాంగణంలోకి మొక్కజొన్న కంకులను అనుమతించకపోవడంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు, “రైతులంటే అంత చులకనా?” అంటూ పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి