Breaking News

కే.హెచ్.ఆర్ ఫౌండేషన్ చలివేంద్రంను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆత్మకూరు ఎం: చలి వేంద్రం ను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరియు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చలి వేంద్రం నిర్వాహకులు కే.హెచ్.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొప్పుల హరిదీప్ రెడ్డి . ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… వేసవి కాలంలో వడ దెబ్బకు ఎంతో మంది అనారోగ్యం చెందుతారని సమయానికి నీరు త్రాగాలని లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదురు అవుతాయని సూచించారు. బాట సారులకు దాహార్తి తీర్చడం గొప్ప విషయం అని, ఆత్మకూరు మండల ప్రజలకు కే.హెచ్.ఆఫ్ గారు చలివేంద్రం తో పాటు ఎంతో మందికి తమ వంతు సేవలను అందించడం అభినందనీయం అని ప్రశంసించారు . ప్రజలలొ ఉంటూ ప్రజా సేవ చేయడం నా అదృష్టం అని, ప్రజా ఆశీస్సులు ఉన్నంత వరకు మేము మా కే.హెచ్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్ముందు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మాజీ ఎంపీటీసీ యాస కవిత , ఇంద్రారెడ్డి మరియు జిల్లా నాయకులు భాష బోయిన ఉప్పలయ్య , కోరే బిక్షపతి , లగల రమేష్ , సోలిపురం అరుణ , కాల మల్లేష్ , కోల సత్తయ్య , పల్లెర్ల సత్యనారాయణ , కొండపల్లి అబ్బ సాయిలు , యాస అంజిరెడ్డి , పురుషోత్తం రెడ్డి , గట్టు శంకర్ , బూడిది వెంకన్న , లోడి మధు , లోడీ పరుశరాములు, శివ మల్లేష్ , లోడి శంకర్ , గజ్జెల్లి మహేష్ , ఎలిమినేటి మచ్చ గిరి కొమ్మరాజుల ఉదయ్ , పంజాల సాయి , మరాఠీ దుర్గా రాజు తదితరులు పాల్గొన్నారు.

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని

మోటకొండూరు చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *