Breaking News

పండుగల సందర్భంగా పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు బహూకరణ

ఉపాధ్యాయుడు ఎస్.కె. ఖాజామియా దాతృత్వ గుణానికి అభినందనలు

సమాజ హితం కోసమే పండుగలు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కోదాడ, మార్చి18 (నేటి తెలుగు పత్రిక ): కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు జమాతే ఇస్లామీ హిందూ సంస్థ కోదాడ పట్టణ అధ్యక్షులు, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్.కె. ఖాజా మియా ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా20 మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు బహూకరించడం జరిగింది. కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి ఎండి .సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు. పండగలు సమాజ హితాన్ని బోధిస్తా యని, అన్ని మతాలు మనుషుల మధ్య ప్రేమ , సోదర, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలియజేస్తున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుడు ఎస్ కె ఖాజామియా దాతృత్వ గుణాన్ని అభినందిస్తూ, జమాతే ఇస్లామీ హిందూ సంస్థ కోదాడ పట్టణంలో చేస్తున్న సేవా కార్యక్రమాల కృషి స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని , సేవ ,సామాజిక బాధ్యత గుణాలను అలవర్చుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *