బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

ధురందర్: రివెంజ్ తెలుగు షోలు రద్దు – మూవీ లవర్స్‌కు షాక్

ధురందర్: రివెంజ్ తెలుగు షోలు రద్దు – మూవీ లవర్స్‌కు షాక్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: మూవీ లవర్స్‌కు నిరాశ కలిగించే పరిణామం చోటుచేసుకుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురంధర్ 2) తెలుగు వెర్షన్ షోలు అకస్మాత్తుగా రద్దయ్యాయి.ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా హిందీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి భాగం లాగే రెండో భాగం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని రివ్యూలు వచ్చాయి. అయితే తెలుగులో ఈ మూవీని థియేటర్లలో చూడాలని ఎదురు చూసిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. మార్చి 19న ప్రదర్శించాల్సిన అన్ని తెలుగు షోలను రద్దు చేసినట్లు థియేటర్లు ప్రకటించాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ఇవ్వనున్నట్లు సమాచారం అందింది.సినిమా విడుదల జాప్యానికి ప్రధాన కారణంగా డబ్బింగ్ పనులు పూర్తికాకపోవడం, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు ఎదురుకావడం వంటి అంశాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ ముందుగా షోలు ప్రారంభమవుతాయని ప్రకటించినప్పటికీ అమలు కాలేదు.గతంలో విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం భారీగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ హామీ ఇచ్చినా, ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మరోసారి నిరాశే ఎదురైంది.ఇక మార్చి 20 నుంచి అయినా తెలుగు షోలు ప్రారంభమవుతాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?