బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

విజయ్ vs భారతీయ జనతా పార్టీ – తమిళనాట రాజకీయ వేడి

విజయ్ vs భారతీయ జనతా పార్టీ – తమిళనాట రాజకీయ వేడి

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చుట్టూ పరిణామాలు వేడెక్కుతున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే) మధ్య సాగుతున్న రాజకీయ పోరులోకి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం ప్రవేశంతో సమీకరణాలు మారుతున్నాయి.ఇటీవల విజయ్‌ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని NDA కూటమిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం సాగింది. అయితే విజయ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతానని స్పష్టం చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కరూర్‌లో జరిగిన భారీ సభలో తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించిన కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా విజయ్‌ను ఇప్పటికే రెండు సార్లు విచారించినట్లు సమాచారం. ‘జననాయకన్’ సినిమా షూటింగ్ కోసం భారీ జనసందోహాన్ని వినియోగించారా అనే కోణంలో సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భాగంగా ఇప్పుడు సీబీఐ దృష్టి సినిమా బృందంపైకి మళ్లింది. దర్శకుడు, ప్రొడక్షన్ టీమ్‌ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని విజయ్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సినిమా–పాలిటిక్స్ కలయికతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్నది ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ