తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) గా ఎ. కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరువూరు రెవెన్యూ కార్యాలయంలో అధికారుల సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరిపాలనను సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు రైతాంగానికి పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించటమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు తిరువూరు ఆర్ డి ఓ గా కేవలం (సుమారు) 15 రోజులు మాత్రమే పనిచేసి బదిలీపై వెళ్లిన కె. పోసు బాబు చేసిన సేవల పట్ల అధికారులు అభినందించారు. నూతనంగా ఆర్ డి ఓ గా బాధ్యతలు చేపట్టిన ఎ. కుమార్ కు అధికారులు సిబ్బంది పూల బొకే శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎ. కుమార్ పదవీ బాధ్యతల స్వీకారం.
