బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – గ్లోబల్ ఫిలిం హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – గ్లోబల్ ఫిలిం హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో మాట్లాడిన ఆయన, హైదరాబాద్‌ను కేవలం ఐటీ, ఫార్మా, బిర్యానీ నగరంగా కాకుండా దేశ సినీ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.గతంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కృష్ణ వంటి దిగ్గజాలు తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అలాగే రామోజీ రావు నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల పరిశ్రమకు స్థిరత్వం లభించిందని అన్నారు.సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ఒకే వేదికపై అందించే సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సూచనలు ఇచ్చారు.

గద్దర్ వంటి ప్రజా కవి, సామాజిక యోధుడి స్ఫూర్తితో సినిమాను సామాజిక మార్పుకు ఆయుధంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ సినీ రంగానికి సురక్షితమైన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతామని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?