బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రభుత్వం మొత్తం ₹3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వివిధ రంగాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పెద్దఎత్తున నిధులు కేటాయించింది.

విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ₹26,674 కోట్లు కేటాయించారు. విద్యుత్ శాఖకు ₹21,285 కోట్లు, వైద్య మరియు ఆరోగ్య శాఖకు ₹13,679 కోట్లు కేటాయించడం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించారు.సామాజిక న్యాయం దృష్ట్యా ఎస్సీ సంక్షేమానికి ₹11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి ₹7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి ₹3,769 కోట్లు కేటాయించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు ₹3,143 కోట్లు, కార్మిక శాఖకు ₹998 కోట్లు కేటాయించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

యువతకు ప్రోత్సాహం కల్పించేలా రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారికి ప్రతినెల ₹2,000 స్కాలర్‌షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ పథకానికి ₹6,000 కోట్లు కేటాయించారు.ఇక గృహ నిర్మాణ రంగానికి ₹7,430 కోట్లు, పశు సంవర్థక శాఖకు ₹1,529 కోట్లు కేటాయిస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ బడ్జెట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.