Breaking News

ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే ముందుకు వెళ్తుందని, విచారణ పూర్తయ్యాకే చర్యలు తీసుకుంటామని తెలిపారు.విచారణ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను సీఎం ఖండించారు. పంజాగుట్టలో నమోదైన ప్రైవేట్ కేసులో మాత్రమే క్లిన్ చిట్ వచ్చిందని వివరించారు.అలాగే బీఆర్ఎస్ పాలనలో సుమారు 6 వేల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. 2014 జూన్ 2 నుంచి జరిగిన విషయాలపై విచారణకు సిద్ధమని తెలిపారు. కె. టి. రామారావు, హరీష్ రావు ఎలాంటి విచారణ కోరినా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం పేర్కొన్నారు.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

మొత్తంగా, ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారి, అధికార-ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు మరింత ముదురుతున్నాయి.

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *