బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం సమీపంలో భూములకు భూ సమీకరణ విధానం అమలు చేయాలి

మచిలీపట్నం సమీపంలో భూములకు భూ సమీకరణ విధానం అమలు చేయాలి

ప్రభుత్వానికి ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ సూచన

విజయవాడ, మార్చి 20, నేటి తెలుగు పత్రిక: మచిలీపట్నం ప్రాంతంలో ఏపీ మారి టైం బోర్డు తీసుకునే భూములను భూ సమీకరణతో తీసుకుంటే అక్కడ భూములు ఉన్నవారికి మేలు జరుగుతుందని ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో దాదాపు 9500 ఎకరాల భూములను ఏపీ మారిటైం బోర్డు తీసుకొని మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయని ,ఈ మేరకు మంగినపూడి తదితర 10 గ్రామాల్లో ప్రస్తుతం భూముల సర్వే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం నార్త్ మండల తహసిల్దార్ పరిధిలో ఈ భూముల సర్వే జరుగుతుందని ఆకుల శ్రీనివాస్ వివరించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా భూమి ధర మూడు కోట్ల రూపాయల వరకు ఉందని, ఒకవేళ భూ సేకరణలో కనుక తీసుకుంటే రైతులకు అక్కడి భూ యజమానులకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. అదే రాజధాని అమరావతి కోసం చేసిన రీతిలో భూ సమీకరణ విధానంలో గనక భూములను సేకరిస్తే రైతులకు పారిశ్రామిక వాణిజ్య ప్రాంతంలో భూమితో పాటు ఇళ్లకు సంబంధించిన స్థలాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆకుల పేర్కొన్నారు. కావున ప్రభుత్వం ఈ ప్రాంతంలోని భూ యజమానులు నష్టపోకుండా భూ సమీకరణ వైపు మొగ్గు చూపిస్తే బాగుంటుందని పలువురు భూ యజమానులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. తన సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్కడివారికి ఒకవేళ ప్రభుత్వం వారి భూములను తీసుకుంటే వారు మరింత గౌరవప్రదంగా జీవనం సాగించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్