Breaking News

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు

తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం మరియు అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ ల్యాబ్ ద్వారా నెయ్యి సహా ఇతర దినుసుల్లో కల్తీని అత్యంత సూక్ష్మమైన PPT స్థాయిలో కూడా గుర్తించగల సామర్థ్యం ఉంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇప్పటికే టీటీడీ నిర్వహిస్తున్న వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను మరింత విస్తరించి, ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఈ ల్యాబ్‌లో ప్రతి నెల 1,000 నుంచి 1,500 వరకు శాంపిల్స్‌ను పరీక్షిస్తూ భక్తులకు అందించే ఆహార నాణ్యతను నిర్ధారిస్తున్నారు.ఈ కొత్త ల్యాబ్‌లో కెమికల్ మరియు మైక్రోబయాలజీ విభాగాలు ఏర్పాటు చేశారు. బ్యాక్టీరియా గుర్తింపుకు ప్రత్యేక క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే పురుగుమందుల అవశేషాలు, యాంటీబయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హానికర పదార్థాలను గుర్తించే పరికరాలు ఏర్పాటు చేశారు.ఈ చర్యలతో శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎలాంటి సందేహం లేకుండా భక్తులకు సురక్షితమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో టీటీడీ ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీకి ఇది ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *