బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రోజా వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

రోజా వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“అధికారం కోల్పోయినా ఇంకా మదం తగ్గలేదని, రోజా వ్యాఖ్యలే దానికి నిదర్శనం” అని ఆమె విమర్శించారు. ఓటమి తర్వాత మార్పు వస్తుందని భావించామని, కానీ ఇంకా అదే తీరులో వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.ప్రత్యేకంగా నారా కుటుంబం, ముఖ్యంగా భువనమ్మపై వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. “భువనమ్మపై మాట జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అంటూ హెచ్చరించారు.అదేవిధంగా వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే రోజా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వెళ్లడం, హిందూ సంప్రదాయాలను పాటించడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, వాటిపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.మొత్తంగా, రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, వ్యక్తిగత విమర్శలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సవిత రోజాకు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్