బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మియాపూర్‌లో మహిళపై కత్తి దాడి

మియాపూర్‌లో మహిళపై కత్తి దాడి

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది.కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌కీపింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇప్పటికే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 20న ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది.అయితే, అదే ప్రాంతంలో వంటమనిషిగా పనిచేస్తున్న అలీషా అలియాస్ పాండు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు.తన వెంట రావాలని మహిళతో వాగ్వాదానికి దిగిన నిందితుడు, ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురై ముందుగా తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నం తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు అలీషా అలియాస్ పాండు మరియు అతని తండ్రి లాలూను అరెస్ట్ చేశారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి