బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్ కార్డు రూల్స్

ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్ కార్డు రూల్స్

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పులు కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారితో పాటు వివరాలు అప్డేట్ చేసుకునే వారికి కూడా వర్తిస్తాయి.ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా పాన్ కార్డు పొందే అవకాశం ఉండేది. కానీ ఇకపై ఆధార్‌తో పాటు మరో గుర్తింపు పత్రం సమర్పించడం తప్పనిసరి కానుంది. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అదనపు పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ దరఖాస్తుల కోసం కొత్త ఫార్మాట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫారమ్‌ల స్థానంలో కొత్త అప్లికేషన్లు మాత్రమే స్వీకరించబడతాయి. అలాగే పాన్‌లో పేరు, ఇతర వివరాలు ఆధార్ ప్రకారం ఉండేలా మార్పులు చేస్తున్నారు. అందువల్ల ఆధార్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇక ఆదాయపు పన్ను శాఖ భారతదేశం పేరుతో ఈ-పాన్ డౌన్‌లోడ్ అంటూ వస్తున్న మోసపూరిత లింకులపై కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు పంపే లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు.ప్రజలు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే సేవలను పొందాలని సూచిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ