విజయవాడ, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంత నవరాత్రోత్సవాలు మరియు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ముఖ్య కార్యక్రమాలు
- 26.03.2026 (గురువారం)
ఉదయం 6:00 గంటలకు చైత్ర శుద్ధ అష్టమి సందర్భంగా
శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, నాగవల్లి దళార్చన (తమలపాకులతో పూజ) - 27.03.2026 (శుక్రవారం) – శ్రీరామనవమి
ఉదయం 10:00 గంటలకు
👉 శ్రీ సీతారాముల కళ్యాణం (కళావేదికలో) - 28.03.2026 (శనివారం)
ఉదయం 9:00 గంటలకు
👉 వసంత నవరాత్రుల పూర్ణాహుతి, ఉత్సవ సమాప్తి
ఉదయం 10:00 గంటలకు
👉 శ్రీ రాముల వారి పట్టాభిషేకం (కళావేదికలో)
ప్రత్యేక పుష్పార్చనలు (ప్రతిరోజూ ఉదయం 9:00)
- 22.03.2026 – మందార, ఎర్ర కలువ
- 23.03.2026 – తెల్ల జిల్లేడు, మారేడు, తులసి
- 24.03.2026 – కాగడ మల్లెలు, జాజులు
- 25.03.2026 – ఎర్ర తామర, గన్నేరు
- 26.03.2026 – చామంతి, సంపంగి
- 27.03.2026 – కనకాంబరం, గులాబీలు
ఆర్జిత సేవ వివరాలు
- సేవ పేరు: ప్రత్యేక పుష్పార్చనలు
- రుసుము: రూ. 2,500/- (దంపతులకు)
- ప్రసాదాలు:
- శేష వస్త్రం
- రవిక
- శ్రీ చక్రపీఠం
- పెద్ద లడ్డు
- అంతరాలయ దర్శనం (ఇద్దరికీ)
- నిర్వహణ స్థలం: నూతన పూజా మంటపం
- టికెట్లు: దేవస్థానం వెబ్‌సైట్ లేదా ఆర్జిత సేవా కౌంటర్లలో లభ్యం
భక్తులందరూ ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం కోరుతోంది.



