Breaking News

పంట నష్టంపై రెండురోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం

అమరావతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అకాల వర్షాలు, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 42 మండలాల్లో సుమారు 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నాయి. వీటి నష్టం విలువ సుమారు రూ.40 కోట్లుగా అంచనా వేశారు.ఇక 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో ఉద్యాన పంటలు ప్రభావితమయ్యాయి. అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, నారింజ, నిమ్మ పంటలకు నష్టం వాటిల్లగా, దాదాపు రూ.23 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.63 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి.

అనుదీప్ హత్య పై విచారణ జరపాలి హంతకులను అరెస్ట్ చేయాలి: రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్

ఇక ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ, యునైటెడ్ స్టేట్స్ సంబంధిత ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్ సప్లై చైన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలు, అన్న క్యాంటీన్లు, అంగన్వాడీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని, ఎరువులు, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా కేంద్రంతో సమన్వయం కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు.

తిరువూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *