బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

తిరువూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

నిరుద్యోగ యువతకు వరం: ఎ.కొండూరు మార్కెట్ యార్డులో నైపుణ్య శిక్షణ కేంద్రం?
మార్కెట్ యార్డ్ గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
చైతన్య నగర్ సమీపంలో నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు.
తిరువూరులో స్కిల్ డెవలప్‌మెంట్ హబ్. ఎ.కొండూరు మార్కెట్ యార్డును పరిశీలించిన కలెక్టర్

తిరువూరు, మార్చి 21 (నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎ.కొండూరు మండలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (ఏఎంసి) మార్కెట్ యార్డును సందర్శించారు. చైతన్య నగర్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ గోడౌన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని, త్వరలోనే ఒక భారీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (నైపుణ్యాభివృద్ధి కేంద్రం) ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోడౌన్లు శిక్షణ తరగతులు నిర్వహించడానికి, ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.గోడౌన్ల ప్రస్తుత పరిస్థితిని, మౌలిక సదుపాయాలను కలెక్టర్ లక్ష్మి శ సమీక్షించారు.యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్. అరవింద్. రెవెన్యూ అధికారులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది మరియు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే తిరువూరు పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ లభించి, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ గిరిజన రాష్ట్ర నాయకులు బి గోపిరాజు , ఎ. కొండూరుమండలంలోని వివిధశాఖలఅధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్