బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కరీంనగర్ లో ప్రపంచ కవితా దినోత్సవం!

కరీంనగర్ లో ప్రపంచ కవితా దినోత్సవం!

కరీంనగర్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమెరికా సామ్రాజ్య వాదం పెచ్చు పెరిగిపోయిందని, భూగోళ వినాశనానికి కంకణం కట్టుకుందని, యుద్దాలను కవ్విస్తూ పంచభూతాలను నాశనం చేస్తోందని, మానవత్వాన్ని మరిచి అమానుష్గంగా ప్రవర్తిస్తోందని, ఇజ్రాయిల్ తొ కలిపి ఇరాన్ పై దాడి చేసి, పశ్చిమాసియాను చమురు సంపదలను అతలాకుతలం చేసిందని శనివారం నాడు కోటా హైస్కూల్ లో జరిగిన ప్రపంచ కవితా దినొత్సవం సందర్భంగా కరీంనగర్ లో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు తమ నిరసనలను వ్యక్తం చేస్తూ కవిత్వాలు చదివారు. విశ్వ సాహితీ కళా వేదిక, శరత్ సాహితీ కళా స్రవంతిల సంయుక్తాధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనానికి ముఖ్య అథిథులుగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సిహెచ్. విజయకుమార్, ప్రముఖ ఆర్కిటెక్ట్ కోల అన్నారెడ్ది, కోటా గ్రూప్స్ విద్యాసంస్థల అధినేత డా. డి. అంజిరెడ్ది హాజరై, కవులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. డా. విజయకుమార్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్య వాదాన్ని ఖండిస్తూ, సర్వమానవ సౌభాతృత్వం వెల్లి విరియాలని, ప్రజాస్వామ్య పంథాలో అన్ని దేశాలు నడవాలని, ప్రపంచ శాంతి వర్ఠిలాలని కోరుతు కవితను వినిపించారు. కవిసమ్మేళనానికి ప్రముఖ కవి, విశ్వసాహితీ కళా వేదిక అధ్యక్షులు వెలుమల జైపాల్ రెడ్ది అధ్యక్షత వహించారు. పలువురు పాల్గొన్న ఈ కవిసమ్మేళనానికి శరత్ సాహితీ కళాస్రవంతి అధ్యక్షుడు డా. సబ్బని లక్ష్మీనారాయణ, కార్యదర్శి సంకేపల్లి నాగేంద్రశర్మలు గౌరవ అతిథులుగా హజరై, తమ కవితలను వినిపించారు. 1999 లో మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం జరపుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. 27వ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భం గొప్పదని కళావేదిక గౌరవ అధ్యక్షులు డా. సబ్బని లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కవి సమ్మేళన కార్యక్రమంలో సాహితీవేత్తలు అన్నాడి గజేందర్ రెడ్ది, డా. మిరియాల శ్రీనివాస్, కముటం రమేష్ , యువ కవులు తరిగొప్పుల కుమారస్వామి, పోరండ్ల రాజేశం, కొత్తకొండ మంజుల, గుగ్గిళ్ళ జనార్ఢనాచారి, నారాయణ రెడ్ది,అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కవిత చదివిన కవులకు శాలువాతో సత్కరించి, సర్టిఫికేట్లను నిర్వాహకులు ప్రదానం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి