బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయస్సు పెంపుపై గ్రీన్ సిగ్నల్?

ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయస్సు పెంపుపై గ్రీన్ సిగ్నల్?

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై సర్కార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ఈ అంశంపై పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, ఉద్యోగ సంఘాలు, నిపుణులు, అధికారులతో చర్చలు జరిపింది. ముఖ్యంగా వయస్సు పెంపుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించినట్లు తెలుస్తోంది.కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, అందులో రిటైర్మెంట్ వయస్సు పెంపుపై అనుకూల అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, కార్పొరేషన్లు, అలాగే 9, 10 షెడ్యూల్ సంస్థలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు ఈ నిర్ణయ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుని, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్