మార్చి 22, నేటి తెలుగు పత్రిక: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది.గతంలో విడుదలైన ‘ధురంధర్’ సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు వచ్చిన సీక్వెల్ మరింత పెద్ద విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మొదటి షో నుంచే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ సినిమాను ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి కూడా ఈ సినిమాపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాకు మొదటి భాగం చాలా నచ్చింది. కానీ ‘ది రివెంజ్’ మాత్రం దానిని అన్ని విధాలా మించిపోయింది. కథ, నటన, టెక్నికల్ అంశాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది” అని ఆయన ప్రశంసించారు.
అలాగే హీరో రణవీర్ సింగ్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆర్. మాధవన్ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించారని అన్నారు.మరోవైపు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తూ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది.మొత్తానికి ‘ధురంధర్ 2’ సినిమా ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులనూ మెప్పిస్తూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది.
