బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

టాలీవుడ్‌కు గుడ్ న్యూస్.. నంది అవార్డుల పునఃప్రారంభానికి ఏపీ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్‌కు గుడ్ న్యూస్.. నంది అవార్డుల పునఃప్రారంభానికి ఏపీ గ్రీన్ సిగ్నల్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్‌కు భారీ శుభవార్త అందించింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులు మళ్లీ ప్రారంభించేందుకు సర్కార్ ముందడుగు వేసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఈ విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కళాకారులకు తగిన గౌరవం అందించేందుకు నంది అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ఇక షూటింగ్స్ పరంగా కూడా విశాఖపట్నంను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఉన్న అందమైన లొకేషన్లను ఉపయోగించుకుని సినిమాల చిత్రీకరణకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. నిర్మాణ సంస్థలకు కూడా సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.

గతంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రదానం చేసేది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఇదే సమయంలో తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ప్రారంభం కావడంతో, టాలీవుడ్ నుంచి కూడా నంది అవార్డులను తిరిగి తీసుకురావాలనే డిమాండ్లు పెరిగాయి.ఇటీవల గద్దర్ అవార్డుల వేడుకలో పాల్గొన్న చిరంజీవి, ఆర్.నారాయణ మూర్తి వంటి ప్రముఖులు కూడా ఏపీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ పరిణామాల మధ్య ఏపీ ప్రభుత్వం స్పందించి, నంది అవార్డుల పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. త్వరలోనే జ్యూరీ ఏర్పాటు చేసి, అధికారికంగా అవార్డుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?