Breaking News

వేసవి లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలి.

వేసవి లో నీటి సరఫరా సమస్యల పై మునిసిపల్ నీటి సరఫరా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.

పైప్ లైన్ లీకేజీ లు రిపేర్ లపై వెంటనే స్పందించాలి.

దత్తాయపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

21 వ వార్డులో మిషన్ భగీరథ మెయిన్ పైపు లైన్ మర్మమ్మత్తులు పరిశీలిస్తున్న మునిసిపల్ చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు, కమీషనర్ రమాదేవి.

కోదాడ, మార్చి 23(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణం లో వేసవి లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలనీ కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. సోమ వారం కోదాడ మునిసిపల్ పరిధిలోని 21 వార్డులో మిషన్ భగీరథ మెయిన్ పైపు లైన్ మర్మమ్మత్తులను కమీషనర్ రమాదేవి, కౌన్సిలర్ జ్యోతి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.వేసవి లో నీటి సరఫరా సమస్యల పై మునిసిపల్ నీటి సరఫరా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.పైప్ లైన్ లీకేజీ లు రిపేర్ లపై వెంటనే స్పందించాలన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే వార్డు ల్లో వాటర్ ట్యాంకర్ ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ కు ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న బోర్లు గుర్తించి మరమ్మత్తులు చేయాలన్నారు. పట్టణ ప్రజలు ఏ సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా తన దృష్టి కి తేవాలన్నారు. సమస్యలను ఎమ్మెల్యే పద్మావతి సహరకారం తో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. పార్టీ మార్పు వివాదం మళ్లీ హాట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *