మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన స్మృతిని స్మరించుకుంటూ పలువురు నాయకులు, సామాజికవేత్తలు ఆయన సేవలను కొనియాడారు.శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సంస్కర్తగా దొమ్మేటి వెంకట రెడ్డి గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి సామాజిక అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేయడం వల్ల సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించారని తెలిపారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకగా నిర్వహించడం ఆయనకు లభించిన గౌరవానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
